జిల్లాల పునర్విభజనపై సుదీర్ఝ చర్చ
జిల్లాల పునర్విభజనపై ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఝంగా చర్చ జరిగినట్లు రెవిన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖల మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పారు.
అమరావతి: జిల్లాల పునర్విభజనపై ఈరోజు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఝంగా చర్చ జరిగినట్లు రెవిన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖల మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో ఇ-క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో దాదాపు 17 జిల్లాల్లో మార్పులు కోసం ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఈ 17 జిల్లాల్లో 25 మార్పులు చేశారు. మిగిలిన 9 జిల్లాల్లో అంటే విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ,గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో ఎటు వంటి మార్పులు లేవన్నారు. గజిట్ జారీ చేసిన తదుపరి ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ మార్పులు చేయడం జరిగింది. అవసరం ఉన్న చోట మండలాలు, డివిజన్లను ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా రంపచోడవరం నియోజక వర్గాన్ని పోవలవరం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలవరం గ్రామాన్ని అభివృద్ది పర్చి రెవిన్యూ డివిజన్ గా భవిష్యత్తులో ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు.
ప్రజల ఆకాంక్ష మేరకు గూడూరులోని కోట, చిలకూరు, గూడూరు మూడు మండలాలను నెల్లూరులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. క్రింద ఉన్న రెండు మండలాలను తిరుపతిలోకి తీసుకురావడం జరిగింది. సామర్లకోట మండలాన్ని పెద్దాపురంలోకి, మండపేటను రాజమండ్రిలోకి మార్చడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండను వాసవీ పెనుగొండగా మిర్చినట్లు తెలిపారు. అద్దంక్కి నియోజక వర్గాన్ని బాపట్ల నుండి ప్రకాశం జిల్లాలోకి, దర్శి నియోజక వర్గం మొత్తం అద్దంకి సబ్ డివిజన్ లో ఉంచుతూ ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా మార్చడం జరిగింది. మార్కాపురం, కనిగిరి, ఎరగొండపాలెం, గిద్దలూరును కలిపి నూతనంగా మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి, రాజంపేటను కడప జిల్లాలోకి మార్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరిగింది. రాయచోటి నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయలేనందున, దాన్ని అన్నమయ్య జిల్లాలోనే ఉంచుతూ జిల్లా కేంద్రంగా మదనపల్లెను మార్చడం జరుగుతుంది. బనగానిపల్లె ఒక సబ్ డివిజన్ గా ఏర్పాటు అవుతున్నది. అనకాపల్లి జిల్లాలోని అడ్దరోడ్దును ఒక సబ్ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరుగుతోంది. సిద్దవటం, ఒంటిమిట్టలను కడపలోనే ఉండే విధంగా, మడకసిరను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని-1, ఆదోని -2 అని ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పాటు అవుతున్న పోలవరం, మార్కాపురం జిల్లాలను కలుపుకుని రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉంటాయని మంత్రి వివరించారు.
జిల్లాల పునర్విభజనకు సంబందించి తే.27.11.2025 దీన గజట్ జారీచేసి, తే.27.12.2025 దీ వరకు అన్ని అభ్యంతరాలను స్వీకరించి చర్చించడం జరిగినందున, వెనువెంటనేనోటిఫికేషన్ ఇచ్చామని, మార్పులు అన్నీ ఈ నెల 31వ తేదీ నుండి ఆచరణలోకి వస్తాయన్నారు.