ఏపీలో కొత్తగా 60 పాజిటివ్ కేసులు .. 403 మంది డిశ్చార్జ్
ఏపీ కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజు 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీ కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజు 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1463కి చేరింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లా లో 33 కేసులు నమోదయ్యాయి.
గడచిన 24 గంటల వరకు 7902 మంది పరీక్షలు నిర్వహించారు. ఇవాళ కర్నూలు లో 25, గుంటూరు 19, కడప 6, అనంతపురం 6, వెస్ట్ గోదావరి 2, విశాఖలో 2 చొప్పున పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. 403 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..33మంది ఈ మహమ్మారిని బారినపడి మరణించారు.
జిల్లాల వారీగా కేసుల సంఖ్య చూస్తే
అత్యధికంగా కర్నూలు జిల్లాలో 411 కేసులు, గుంటూరు 306, కృష్ణా జిల్లాలో 246 కేసులు నమోదు కాగా.. విశాఖపట్నం 25 , అనంతపురం 67, చిత్తూరు 80, నెల్లూరు 84 , కడప 79, ప్రకాశం 60, తూర్పుగోదావరి 53, పశ్చిమగోదావరి 58, శ్రీకాకుళం 5, విజయనగరం జిల్లా లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు