Bheemili: క్రీడలకు కూటమి ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిస్తోంది ఎమ్మెల్యే గంటా!

Bheemili: క్రీడలకు కూటమి ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. భీమిలిలో రగ్బీ పోటీలను ఆయన ప్రారంభించారు.

SHIVA, BHIMILI
Published on: 5 Oct 2026 6:47 PM IST
Bheemili
X

Bheemili: క్రీడలకు కూటమి ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిస్తోంది ఎమ్మెల్యే గంటా!

Bheemili: క్రీడలకు కూటమి ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి ఫుట్ బాల్ గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రగ్బీ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు నగదు, ఇంటి స్థలం, అకాడమీ కోసం భూమి, ప్రభుత్వ ఉద్యోగం వంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. షటిల్ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అకాడమీ కోసం విశాఖలో భూమి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జీవితంలో ఆటుపోట్లు తట్టుకునే శక్తి క్రీడాకారులకు ఎక్కువగా ఉంటుందని, గెలుపు ఓటముల కంటే ఆటల్లో భాగస్వామ్యం కావడం ముఖ్యమన్నారు. శారీరక దృఢత్వంతో ఏకాగ్రత పెరుగుతుందని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారని తెలిపారు. 3 జిల్లాల నుంచి వచ్చిన 200 మంది విద్యార్థులు పాల్గొంటున్న రగ్బీ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. క్రీడలను ప్రోత్సహిస్తున్న సన్ స్కూల్ కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాస్ ను, జిల్లా ఫిజికల్ డైరక్టర్ల సంఘం కార్యదర్శి లలిత్ కుమార్ ను ప్రశంసించారు.

కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సోమశేఖర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యనిర్వహక కార్యదర్శి ఎన్.ఎస్.జి. వర్మ, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, జీరు కైలాష్ రెడ్డి, శాఖారి శ్రీనివాస్, గాడు వెంకటప్పడు, సరగడ అప్పారావు, తాట్రాజు అప్పారావు, ఎల్.వి.రమణ, రామానాయుడు, కసిరెడ్డి దామోదరరావు, రామరాజు, గరే గుర్నాథ్, మన్యాల సోంబాబు, నాగోతి శివాజీ, చెట్టుపల్లి గోపీ, బోని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI