

Polavaram: పోలవరం జెడ్పీ పీఠం ఎవరికి? రేసులో వంతల రాజేశ్వరి!
పోలవరం జిల్లా రాజకీయాల్లో జడ్పీ చైర్మన్ పీఠం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాలకు పోరు హోరాహోరీగా సాగుతుండగా, ఫలితాలపై ఇప్పటినుంచే లెక్కలు మొదలయ్యాయి. కూటమి మెజారిటీ స్థానాలు గెలిస్తే జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ జిల్లా వ్యాప్తంగా నెలకొంది.


Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికల భద్రతపై ఎస్పీ జగదీష్ సమీక్ష!
వినుకొండ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి తెలిపారు. ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించిన ఆయన మాట్లాడుతూ.. వినుకొండ మున్సిపాలిటీ పరిధిలోని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.


Off The Record: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!
Off The Record: కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఉపసంహరించుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.


Cyclone Murasu: అర్నబ్ భయం తీరకముందే మరో దెబ్బ.. ఏపీకి పొంచి ఉన్న భారీ తుఫాన్ ముప్పు
అర్నబ్ తుఫాన్ భయం నుంచి తేరుకోకముందే ఏపీకి మరో తుఫాన్ ముప్పు ముంచుకొచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ నవంబర్ 2, 3 తేదీల్లో భారీ వర్షాలు కురిపించే అవకాశం ఉంది.


Chilakaluripet: చంద్రబాబు పాలనతోనే ప్రత్యర్థులకు సమాధానం!
విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన ఇన్‌చార్జ్ తోట రాజారమేశ్, కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి తోట రాజరాజేశ్వరి వ్యాఖ్యలు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యాంశాలు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురైంది. 53 రోజుల నిర్బంధం అనంతరం 2023 అక్టోబర్ 31న చంద్రబాబు విడుదలై నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి.


Rajahmundry: బియ్యం ధరల నియంత్రణకు చర్యలు జేసీ మేఘా స్వరూప్ హెచ్చరిక!
రాష్ట్రంలో బియ్యం ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు సరసమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు.


Amalapuram: అమలాపురంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల క్యాండిల్ ర్యాలీ!
పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు ఆర్మోడ్ రిజర్వడ్ కార్యాలయం నుండి గడియారం స్తంభం వరకు పోలీసుశాఖ మరియు ప్రజల తో కలిసి 'క్యాండిల్ ర్యాలీ' నిర్వహించి,అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.


Burning Topic: అద్భుతాన్ని ఆవిష్కరించిన ఇస్రో!
Burning Topic: ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్18 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నావిక్ వ్యవస్థను బలోపేతం చేసే ఎన్‌వీఎస్ 03 ఉపగ్రహాన్ని షార్ నుంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.


Jaggampeta: తామరాడలో వైసీపీకి షాక్ ఎమ్మెల్యే జ్యోతుల సమక్షంలో టీడీపీలోకి కలయిక!
కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో పర్యటిస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా తామరాడ గ్రామంలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


Eluru: ఏలూరు జిల్లాలో పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధం!
ఏలూరు జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ,నూజివీడు,జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలలో నవంబర్, 1వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని,పోలింగ్ నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.ఏలూరు సర్ సి.ఆర్.ఆర్.పబ్లిక్ స్కూల్ లో శనివారం పోలింగ్ సిబ్బందికి ఏర్పాటుచేసిన పోలింగ్ పరికరాల పంపిణీ కేంద్రంలో పోలింగ్ పరికరాల పంపిణీని జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.


Burning Topic: ఢిల్లీ జనాన్ని వణికిస్తున్న కాలుష్యం!
Burning Topic: ఢిల్లీలో అకాల వర్షాలతో 123.3 mm వర్షపాతం నమోదైంది. 1951 తర్వాత అత్యంత తక్కువ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, వాయు నాణ్యత (AQI) గణనీయంగా మెరుగుపడింది.


Aluru: మాటల రాజకీయాలు కాదు.. చేతల్లో అభివృద్ధి చూపిస్తాం!
మన ప్రాంతానికి సుస్థిరమైన పాలన, నిరంతర అభివృద్ధి ఎంతో అవసరమని జనసేన పార్టీ అలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తెర్నేకల్ వెంకప్ప పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ ఆశీర్వాదం, మద్దతు అందించాలని ఆయన కోరారు.