Aluru: మాటల రాజకీయాలు కాదు.. చేతల్లో అభివృద్ధి చూపిస్తాం!

Aluru: అలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయం కోసం జనసేన ఇన్‌చార్జ్ తెర్నేకల్ వెంకప్ప ప్రచారం. విద్యావంతులైన ZPTC, MPTC అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి.

G Jagadeesh, Pathikonda
Published on: 1 Nov 2026 6:59 AM IST
Aluru
X

Aluru: మాటల రాజకీయాలు కాదు.. చేతల్లో అభివృద్ధి చూపిస్తాం!

Aluru: మన ప్రాంతానికి సుస్థిరమైన పాలన, నిరంతర అభివృద్ధి ఎంతో అవసరమని జనసేన పార్టీ అలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తెర్నేకల్ వెంకప్ప పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ ఆశీర్వాదం, మద్దతు అందించాలని ఆయన కోరారు.

పుల్లాపురం, కొత్తపేట గ్రామాల ప్రజలు కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి తమ అమూల్యమైన మద్దతును అందించాలని విజ్ఞప్తి చేశారు. దేవనకొండ ZPTC కూటమి అభ్యర్థిగా డాక్టర్ షేక్ సాధిక పోటీ చేస్తున్నారని, ఆమె MBBS పూర్తి చేసిన విద్యావంతురాలైన యువతి అని తెలిపారు. యువ నాయకత్వానికి, అభివృద్ధి ఆలోచనలకు ఆమె ఒక ఉదాహరణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

అదేవిధంగా ఆస్పరి మండలం నుంచి జనసేన పార్టీ తరఫున కూటమి ZPTC అభ్యర్థిగా ఉదయ్ కుమార్ (B.Sc., B.Ed.) పోటీ చేస్తున్నారని తెలిపారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని, అలాంటి నాయకత్వాన్ని ప్రజలు ప్రోత్సహించాలని కోరారు.

కూటమి తరఫున ZPTC, MPTC అభ్యర్థుల ఎంపికలోనూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి బరిలోకి తీసుకొచ్చామని వెంకప్ప వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, పాత రాజకీయ విధానాలకు స్వస్తి పలికి కొత్త నాయకత్వం, అభివృద్ధి, బాధ్యతాయుతమైన పాలనకు అవకాశం కల్పించాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ రాజకీయాలకు స్వస్తి పలికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కూటమి ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. చెప్పడమే కాదు… చేసి చూపిస్తున్నాం. అభివృద్ధి చేస్తున్నాం… మీ ఆశీర్వాదం కోరుతున్నాం. ప్రజల మద్దతుతో మన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం” అని తెర్నేకల్ వెంకప్ప పేర్కొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda