Polavaram: పోలవరం జెడ్పీ పీఠం ఎవరికి? రేసులో వంతల రాజేశ్వరి!
Polavaram: పోలవరం జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ. మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేరు తెరపైకి రాగా, ఆమెను అడ్డుకునేందుకు ప్రత్యర్థి వర్గాలు పావులు కదుపుతున్న వైనం.
Polavaram: పోలవరం జెడ్పీ పీఠం ఎవరికి? రేసులో వంతల రాజేశ్వరి!
Polavaram: పోలవరం జిల్లా రాజకీయాల్లో జడ్పీ చైర్మన్ పీఠం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాలకు పోరు హోరాహోరీగా సాగుతుండగా, ఫలితాలపై ఇప్పటినుంచే లెక్కలు మొదలయ్యాయి. కూటమి మెజారిటీ స్థానాలు గెలిస్తే జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ జిల్లా వ్యాప్తంగా నెలకొంది.
రాజేశ్వరికే మొగ్గు..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీడీపీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలం పార్టీ జెండా మోసిన రాజేశ్వరికి పదవి ఇస్తే పార్టీకి మరింత పట్టు దొరుకుతుందని అధినాయకత్వం భావిస్తోంది. 12 స్థానాల్లో కూటమి లెక్క చూస్తే - టీడీపీ 7, జనసేన 4, బీజేపీ 1 చొప్పున బరిలో ఉన్నాయి. మెజారిటీ మార్క్ దాటితే చైర్మన్ పీఠం రాజేశ్వరిని వరిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తెరవెనుక అడ్డుకునే ప్రయత్నాలు
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వంతల రాజేశ్వరి జడ్పీ చైర్మన్ అయితే జిల్లాలో తమ పలుకుబడి, పెత్తనం పూర్తిగా తగ్గిపోతుందని ఒక బలమైన వర్గం ఆందోళన చెందుతోందట. దీంతో ఆమెకు పీఠం దక్కకుండా చేయాలని ఆ వర్గం తెరచాటున పావులు కదుపుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.మరి అధిష్టానం లెక్కలను తారుమారు చేస్తూ అంతర్గత వర్గం పైచేయి సాధిస్తుందా? లేక మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరికే జడ్పీ కిరీటం దక్కుతుందా? అనేది తేలాలంటే మెజారిటీ ఎవరికి వస్తుందో, అధిష్టానం తుది నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.




