Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో సినీ హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు!
Srikalahasti: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయాన్ని టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల శుక్రవారం కుటుంబ సమేతంగా సందర్శించి శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయంలో సినీ హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పూజలు!
శ్రీకాళహస్తి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో సినీ హీరోయిన్ శ్రీలీల సందడి చేశారు. శుక్రవారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు పొందిన శ్రీలీల భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. సినీ హీరోయిన్ శ్రీలీల ఆలయానికి విచ్చేసిన విషయం తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపించారు. ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.




