Srikalahasti: శ్రీకాళహస్తిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్!
Srikalahasti: శ్రీకాళహస్తిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గొర్రెపాటి సురేష్‌పై రెండు కేసులు నమోదు చేసి 24 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Srikalahasti: శ్రీకాళహస్తిలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్!
Srikalahasti: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై శ్రీకాళహస్తి పోలీసులు రెండు కేసులు నమోదు చేసి, 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తొట్టంబేడు మండలం పొయ్యకోతూరు గ్రామానికి చెందిన గొర్రెపాటి సురేష్ (25) మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ ఘటనకు సంబంధించి ఈ నెల 19న శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్లో Cr.No.128/2026, Cr.No.129/2026 కింద BNSలోని వివిధ సెక్షన్లతో రెండు కేసులు నమోదు చేశారు.
కేసుల దర్యాప్తులో భాగంగా నిందితుడు గొర్రెపాటి సురేష్‌ను 24 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పోలీసులు తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వేధింపులకు పాల్పడటం వంటి ఘటనలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.




