Hyderabad: కార్తీక దీపం వెలిగిస్తుండగా చీరకు మంటలు.. చివరకు ప్రాణాలు కోల్పోయిన మహిళ!
Hyderabad: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో కార్తీక సోమవారం రోజు దీపం వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకుని వృద్ధురాలు చాపర్ల భానుమతి గాయపడ్డారు.
Hyderabad: కార్తీక దీపం వెలిగిస్తుండగా చీరకు మంటలు.. చివరకు ప్రాణాలు కోల్పోయిన మహిళ!
Hyderabad: కార్తీక మాసం పూజ వేళ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది.
ఎస్ఆర్ నగర్లోని జగన్నాథ రెసిడెన్సీలో నివసిస్తున్న తన కూతురు కిన్నెర వద్ద చాపర్ల భానుమతి అనే వృద్ధురాలు ఉంటున్నారు. ఈ నెల 23న రెండో కార్తీక సోమవారం సందర్భంగా ఇంట్లో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు భానుమతి చీరకు నిప్పు రవ్వలు అంటుకున్నాయి.
చీరకు అంటుకున్న మంటలు కొన్ని క్షణాల్లోనే ఒళ్లంతా వేగంగా వ్యాపించాయి. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఆమె శరీరం దాదాపు 50 శాతానికి పైగా కాలిపోయింది.
బాధితురాలిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన భానుమతి, చికిత్స ఫలించక బుధవారం తుదిశ్వాస విడిచారు. కార్తీక మాస పూజ సమయంలో తల్లి ఇలా దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కూతురు కిన్నెర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




