Husnabad: కండక్టర్ ప్రవళిక మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: TMU!
Husnabad: మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆమె కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా, ఉద్యోగం ఇవ్వాలని టీఎంయూ నేత ఎంపీ రెడ్డి డిమాండ్ చేశారు.
Husnabad: కండక్టర్ ప్రవళిక మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: TMU!
హుస్నాబాద్, నవంబర్ 4: మణుగూరు డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ప్రవళిక గారి మృతి పట్ల టీఎంయూ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తోందని,ఆమె మృతికి ప్రభుత్వం,ఆర్టీసీ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని టీఎంయూ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎంపీ రెడ్డి డిమాండ్ చేశారు.
బుధవారం హుస్నాబాద్ పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడంలో ఆర్టీసీ కార్మికులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆ కృషికి తగినట్టు ఫలితం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల భద్రతను ప్రభుత్వం,యాజమాన్యం పూర్తిగా గాలికి వదిలేసిందని బస్సులలో ఓవర్ లోడ్ తో కండక్టర్లు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,రద్దీ సమయంలో ప్రయాణికుల ఒత్తిడి, నిలబడే చోటు కూడా లేని పరిస్థితి, సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి విషాద ఘటనలు జరుగుతున్నాయని
కార్మికుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని ప్రభుత్వం వెంటనే కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రవళిక మృతికి కారకురాలిన నిందితుడాలని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి ఆర్టిసి యాజమాన్యానికి ఆయన డిమాండ్ చేశారు.
మృతురాలు ప్రవళిక కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలని, రద్దీ ఉన్న ప్రాంతాలలో, రద్దీ సమయంలో ఆర్టీసీ అదనపు బస్సులను నడపాలి. ఓవర్ లోడ్ ను అరికట్టాలని,మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ,ఆర్టీసీ కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రవళిక మృతి కేవలం ఒక ప్రమాదం కాదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్య లాంటిదే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, లేనిపక్షంలో టీఎంయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఎంపీ రెడ్డి హెచ్చరించారు.




