Ainavilli: అగ్నిప్రమాద బాధితురాలి కుటుంబానికి దళితసేన ఆర్థిక సహాయం
Ainavilli: అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన అయినవిల్లిలంక బాధితురాలు కొప్పడి శివగంగ కుటుంబానికి దళితసేన ఆధ్వర్యంలో రూ.10,500 ఆర్థిక సహాయం అందజేత.
Ainavilli: అగ్నిప్రమాద బాధితురాలి కుటుంబానికి దళితసేన ఆర్థిక సహాయం
అయినవిల్లి: పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం అయినవిల్లి లంక గ్రామం బీసీ కాలనీ చెందిన పోతాబత్తుల నరసింహ రావు కుమార్తె కొప్పడి శివగంగ ఇల్లు ఇటీవలే కాలమున ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గురై పూర్తిగా కాలిపోయింది.
స్థానిక దళిత సేన సభ్యుల ద్వారా తెలుసుకొని మానవతా దృక్పథంతో సేవా భావంతో ఈరోజు ఆ కుటుంబానికి దళిత సేన గ్రూప్ సభ్యులు 10,500 నగదు అందజేసి మనోధైర్యాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో దళిత సేన చైర్మన్ మెండి డేవిడ్ అంబేద్కర్,స్థానిక మాజీ సర్పంచ్ కుమ్మరి మాధవి రమణ,అయినవిల్లి మాల మహానాడు అధ్యక్షుడు గిడ్ల వెంకటేశ్వరరావు,అంబేద్కర్ ఇండియన్ మిషన్ జల్లి నరేష్,పిల్లి కొండబాబు,దళిత సేన గౌరవ అధ్యక్షులు వాకపల్లి హరీష్,దళిత సేన ట్రెజరర్ సాపే రమేష్ దళిత సేన సభ్యులు జిత్తిక రాజీవ్,నల్లా విజయ్,మాదే విజయ్,గోసంగి జాకబ్ ప్రభు,కుసుమ సురేష్, పోల్నాటి మహేష్,దాకవరపు సత్యనారాయణ,కామిడి సామ్యూల్ జ్యోతి తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




