Prakasam: తౌషిక్, మౌలాబి మృతి కేసులో కీలక మలుపు ఇద్దరి అరెస్ట్!
Prakasam: ప్రకాశం జిల్లా తౌషిక్, మౌలాబి మృతి కేసులో కీలక మలుపు. చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ చైర్మన్, వార్డెన్ అరెస్ట్. ముగ్గురు నిందితులు పరారీ.
Prakasam: తౌషిక్, మౌలాబి మృతి కేసులో కీలక మలుపు ఇద్దరి అరెస్ట్!
Prakasam: ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి, ఆ తర్వాత న్యాయం కోసం పోరాడుతూ అతని తల్లి మౌలాబి మృతి చెందిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కోచింగ్ సెంటర్ చైతన్య, వార్డెన్ బాబ్జి ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మొత్తం ఐదుగురు నిందితులు కాగా ముగ్గురు పరారి లో ఉన్నారని పోలీస్ లు తెలిపారు.
ఈ కేసులో కోచింగ్ సెంటర్ వాకా చైతన్య రెడ్డి, హాస్టల్ వార్డెన్ బాబ్జిలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్ నిర్వహణ, అక్కడి సిబ్బంది పాత్రకు సంబంధించి దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 14న తౌషిక్ అనుమానాస్పద మృతి
కనిగిరికి చెందిన తౌషిక్ సింగరాయకొండ మండలం మూలగుంటపాడులోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న కోచింగ్ సెంటర్ ప్రాంగణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే తమ కుమారుడి మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తౌషిక్ది ఆత్మహత్య కాదని, హత్య జరిగి ఉంటుందని ఆరోపిస్తూ కోచింగ్ సెంటర్ యాజమాన్యం, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కుమారుడికి న్యాయం చేయాలంటూ తల్లి పోరాటం
తన కుమారుడి మృతికి అసలు కారణాలు వెల్లడించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి మౌలాబి నిరంతరం పోరాటం చేశారు. కోచింగ్ సెంటర్ వద్ద ఆందోళన చేస్తూ న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో సెప్టెంబర్ 10న కోచింగ్ సెంటర్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 12న మృతి చెందారు. దీంతో తౌషిక్, మౌలాబి మరణాలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
హైకోర్టు ఆదేశాలతో వేగవంతమైన దర్యాప్తు
ఈ రెండు మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధిత కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కేసు దర్యాప్తు విషయంలో హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించడం, ఫోరెన్సిక్ కోణంలో పరిశీలించడం, ఉన్నతాధికారి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించడం వంటి అంశాలపై న్యాయస్థానం దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇన్నాళ్లుగా తమ కుమారుడి మృతికి న్యాయం చేయాలని పోరాడిన కుటుంబానికి ఈ పరిణామం కీలకంగా మారింది.
అరెస్టులతో కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడినప్పటికీ, తౌషిక్ మృతి వెనుక అసలు కారణాలు ఏమిటి? మౌలాబి చేసిన ఆరోపణల్లో వాస్తవాలేమిటి? ఈ ఘటనల్లో ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది? అన్న అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.




