Kanigiri: కనిగిరిలో భారీ అగ్నిప్రమాదం: 4 కార్పెంటర్ షాపులు పూర్తిగా దగ్ధం

Kanigiri: కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డు దరువు బజారులో భారీ అగ్నిప్రమాదం సంభవించి నాలుగు కార్పెంటర్ షాపులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

Guravayya, Kanigiri
Published on: 20 Oct 2026 9:06 PM IST
Kanigiri
X

Kanigiri: కనిగిరిలో భారీ అగ్నిప్రమాదం: 4 కార్పెంటర్ షాపులు పూర్తిగా దగ్ధం

మార్కాపురం జిల్లా, కనిగిరి: మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డు దరువు బజారులో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇండ్ల తిరుపతయ్యకు చెందిన నాలుగు కార్పెంటర్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో షాపుల్లోని మిషన్లు, కలప పూర్తిగా దగ్ధమయ్యాయి.

అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే షాపుల్లోని విలువైన సామగ్రి మంటల్లో కాలిపోయింది.

ఈ ప్రమాదంలో సుమారు రూ.30 లక్షల విలువైన మిషన్లు, కలప దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. లక్షల రూపాయల విలువైన కలప పూర్తిగా బూడిద కావడంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. కష్టపడి సంపాదించిన ఆస్తి కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri