Pitlam: పిట్లం జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైన కారు!

Pitlam: కామారెడ్డి జిల్లా పిట్లం శివారులో 161 జాతీయ రహదారిపై ఆదివారం షార్ట్ సర్క్యూట్‌తో కారు పూర్తిగా దగ్ధమైంది. ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

VEERANNA, JUKKAL
Published on: 29 Nov 2026 9:27 PM IST
Pitlam
X

Pitlam: పిట్లం జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైన కారు!

పిట్లం (కామారెడ్డి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం శివారు సంగారెడ్డి -నాందేడ్ -అకోలా 161 జాతీయ రహదారి పై మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా అగ్నికి అహుతయినా ఘటన పిట్లం శివారులో చోటు చేసుకుంది.

మహారాష్ట్ర లొని బస్మాత్ కు చెందిన యాసిర్ తోపాటు మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్ కు కారులో వెళ్తుండగా కారు నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు కారును పక్కకు నిలిపివేశారు. ముగ్గురు కలిసి ముందస్తు జాగ్రత్తగా అప్రమత్త మై కారులోని లగేజీ మొత్తం కిందికి తీసి వీరు కారు నుంచి కిందికి దిగిన కొద్దీ క్షణాలకే కారులో మంటలు తీవ్ర రూపం దాల్చడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.

ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పి ప్రాణాలతో బయట పడ్డారు.ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణానష్టం జరుగక పోవడం తో స్థానిక ప్రత్యక్ష సాక్షులతోపాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పిట్లం ఎస్సై ఆంజినేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL