Bomb Threat: మిడ్ ఎయిర్లో బాంబు బెదిరింపు.. జైపూర్లో అత్యవసరంగా దిగిన ఎయిర్ ఇండియా విమానం!
Bomb Threat: ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు. జైపూర్లో విమానం అత్యవసర ల్యాండింగ్, సురక్షితంగా కిందకు దిగిన ప్రయాణికులు.
Bomb Threat: మిడ్ ఎయిర్లో బాంబు బెదిరింపు.. జైపూర్లో అత్యవసరంగా దిగిన ఎయిర్ ఇండియా విమానం!
Bomb Threat: జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరం నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా (Air India - Flight AI2030) బోయింగ్ 787-9 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. భారత గగనతలంలోకి విమానం ప్రవేశిస్తున్న సమయంలో ఈ సెక్యూరిటీ అలెర్ట్ రావడంతో పైలట్లు వెంటనే స్పందించి విమానాన్ని రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
బుధవారం (అక్టోబర్ 14) ఉదయం ప్రయాణంలో ఉన్న ఎయిర్ ఇండియా విమానానికి భద్రతా ముప్పు కలగడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC), భద్రతా సంస్థలు తక్షణమే స్పందించాయి. జైపూర్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా దిగిన వెంటనే విమానాన్ని ప్రత్యేక ఐసోలేషన్ బేకి తరలించారు.
విమానంలో ఉన్న ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరినీ అధికారులు సురక్షితంగా కిందకు దించారు. సీఐఎస్ఎఫ్ (CISF) భద్రతా బలగాలు, బాంబు నిర్వీర్యక దళాలు (Bomb Squad) మరియు డాగ్ స్క్వాడ్తో విమానంలో అంగుళం అంగుళం ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
బెదిరింపు సందేశం ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న మూలాలు ఏమిటనే దానిపై భద్రతా అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి తనిఖీలు పూర్తయిన తర్వాతే విమానాన్ని ఢిల్లీకి పంపించే అవకాశం ఉంది.




