Suryapet: డిసెంబర్ 1న సూర్యాపేటలో రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞం!

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల నగర్‌లో డిసెంబర్ 1న 1116 మంది దంపతులచే నిర్వహించే శ్రీ రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞం ఏర్పాట్లకు పీఠాధిపతులు భూమి పూజ నిర్వహించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 20 Nov 2026 9:10 AM IST
Suryapet
X

Suryapet: డిసెంబర్ 1న సూర్యాపేటలో రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞం!

సూర్యాపేట: హిందూ ధర్మంలో ప్రతి హిందువు సంవత్సరానికి ఒక్కసారైనా యజ్ఞం, వ్రతం నిర్వహించాలని వేదాలు చెబుతున్నాయని, ఏ హోమం, వ్రతాలు చేయలేని భక్తజనులు, పేదల కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ బాల మానస మహా విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ సద్గురు భవాని స్వామీజీ తెలిపారు.

డిసెంబర్ 1న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అమ్మ గార్డెన్ ఎదురుగా తిరుమల నగర్‌లో యర్రంశెట్టి ఉపేందర్ స్వామికి చెందిన స్థలంలో నిర్వహించే రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞ ఏర్పాట్లకు గురువారం అంకురార్పణ చేసి భూమి పూజ నిర్వహించి ఆయన మాట్లాడారు.

యజ్ఞ యాగాదుల ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఆ ఖర్చులను భరించలేక యజ్ఞాలు, యాగాలు కుంటుపడుతున్నాయని అన్నారు. సమాజ శ్రేయస్సును కోరి, మానవ కర్మలను తొలగించేందుకు గురువు శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ సుదర్శన ఆశ్రమ స్వామీజీ ఆశీస్సులతో ఎనిమిది మహా యాగాలు నిర్వహించడం జరిగిందన్నారు.

ప్రస్తుతం తొమ్మిదవసారి డిసెంబర్ 1, 2026న 1116 మంది దంపతులచే శ్రీ రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల నగర్ రోడ్ నెంబర్ 24, 100 ఫీట్ల కలెక్టరేట్ రోడ్, అమ్మ గార్డెన్ ఎదురుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరు ఈ యజ్ఞంలో పాల్గొనేలా కేవలం రూ.1516 చెల్లించి హోమంలో పాల్గొనే అవకాశాన్ని తమ ట్రస్టు కల్పిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ జహీర్, నాయకులు సలిగంటి వీరేందర్, యర్రంశెట్టి ఉపేందర్, తులసి, సంకురిశెట్టి పరమేష్, సబిత, ప్రసాదు, వాసుదేవరావు, సరళ, ఆనందరావు, అనిత, శ్రీనివాస్ రెడ్డి, ఉమా, సంజీవరెడ్డి, ఉదయశ్రీ, శ్రీనివాస్ రెడ్డి, పద్మ, రాంరెడ్డి, రమ, వెంకట్ రెడ్డి, కళావతి, శ్రీనివాసరావు, శిల్ప, లక్ష్మారెడ్డి, సంధ్య, ట్రస్టు సభ్యులు జెట్టి రవికుమార్, రాజీరెడ్డి, శ్రావణ్ కుమార్, క్రాంతికుమార్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA