Nalgonda: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం!
Nalgonda: నల్లగొండ పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం. ఆర్పీ రోడ్డులోని ఎస్ఎస్ జిరాక్స్ సెంటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు. రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం.
Nalgonda: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం!
Nalgonda: జిల్లా కేంద్రంలోని ఆర్పీ రోడ్డులో సోమవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్పీ రోడ్డు సిక్వాడ ఎదురుగా ఉన్న ‘ఎస్ఎస్ జిరాక్స్ సెంటర్’లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రాాత్రి షాపు నుంచి దట్టమైన పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమై షాపు షట్టర్లు తెరిచి చూడగా భారీగా మంటలు వ్యాపించి ఉన్నాయి. స్థానికులు వెంటనే స్పందించి పక్కనే ఉన్న బోర్ మోటార్ ఆన్ చేసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. అలాగే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు.
ఈ ప్రమాదంలో షాపులోని యంత్రాలు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయని, దాదాపు ₹3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు నిర్వాహకులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




