Deepika Padukone: దీపిక-రణ్వీర్ ఇంట బేబీ గర్ల్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.!
Deepika Padukone: బాలీవుడ్ రొమాంటిక్ జంట దీపికా పదుకోణ్, రణ్వీర్ సింగ్ ఇంట మళ్లీ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ క్రేజీ కపుల్ రెండోసారి తల్లిదండ్రులుగా మారారు.
Deepika Padukone: దీపిక-రణ్వీర్ ఇంట బేబీ గర్ల్.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.!
Deepika Padukone: బాలీవుడ్ రొమాంటిక్ జంట దీపికా పదుకోణ్, రణ్వీర్ సింగ్ ఇంట మళ్లీ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ క్రేజీ కపుల్ రెండోసారి తల్లిదండ్రులుగా మారారు. దీపిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పటికే వీరికి 'దువా' అనే కుమార్తె ఉండగా, ఇప్పుడు మరొక పాప రాకతో పదుకోణ్-సింగ్ కుటుంబంలో ఆనందం రెట్టింపైంది.
సోషల్ మీడియా వేదికగా ఆనందం పంచుకున్న జంట
సెప్టెంబర్ 19న చిన్నారి జన్మించినట్లు రణ్వీర్, దీపికా సంయుక్తంగా ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను పంచుకున్నారు. "వెల్కమ్ బేబీ గర్ల్, 19/9/2026" అని రాసి ఉన్న కార్డ్‌ను షేర్ చేస్తూ, చివరన దువా, దీపికా, రణ్వీర్ పేర్లను జోడించారు. దిష్టి తగలకుండా ఈవిల్ ఐ (Evil-eye) ఈమోజీని ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా పెట్టారు. తమ మొదటి కుమార్తె దువాకు త్వరలోనే చెల్లి రాబోతోందని గతంలోనే సృజనాత్మకంగా ప్రకటించిన ఈ జంట, ఇటీవల దువా రెండో పుట్టినరోజు సందర్భంగా మాతృత్వానికి సంబంధించిన ప్రత్యేక ఫోటోషూట్ పిక్స్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు.
సిద్ధివినాయకుని ఆశీస్సులు
పాప జన్మించడానికి ఒక్కరోజు ముందే ఈ దంపతులు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దీపికా పర్పుల్ కలర్ కుర్తా సెట్లో మెరవగా, రణ్వీర్ కూడా అదే రంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. సరిగ్గా రెండేళ్ల క్రితం, 2024 సెప్టెంబర్ 8న తమ తొలి కుమార్తె 'దువా' జన్మించడానికి కొద్దిరోజుల ముందు కూడా ఈ దంపతులు ఇదే రీతిలో సిద్ధివినాయకుని ఆశీస్సులు తీసుకోవడం గమనార్హం.
వెల్లువెత్తిన శుభాకాంక్షలు
రెండో పాప రాకతో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రణ్వీర్ సహనటుడు అనిల్ కపూర్ స్పందిస్తూ "ఇద్దరూ అమ్మాయిలే కావడం అద్భుతం.. ఆడపిల్లలే ఎల్లప్పుడూ అత్యుత్తమం" అని వ్యాఖ్యానించగా, డిజైనర్ మసాబా గుప్తా "ఇద్దరు ఆడపిల్లలు! అంతకంటే కావాల్సింది ఏముంది" అని సంతోషం వ్యక్తం చేశారు. వీరితో పాటు సోనమ్ కపూర్, నేహా ధూపియా, కృతి ఖర్బందా వంటి పలువురు ప్రముఖులు ఈ స్టార్ కపుల్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త చిన్నారిని ఎప్పుడు చూపిస్తారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.




