Manoharabad: దీపావళి దీపాలతో విషాదం - లుంగీకి నిప్పంటుకుని వృద్ధుడు మృతి

Manoharabad: మనోహరాబాద్ మండలం పార్కిబండలో దీపావళి దీపాలు వెలిగిస్తుండగా లుంగీకి నిప్పంటుకుని మల్లేష్ (65) అనే వృద్ధుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

RAJU,TOOPRAN
Published on: 9 Nov 2026 6:57 PM IST
Manoharabad
X

Manoharabad: దీపావళి దీపాలతో విషాదం - లుంగీకి నిప్పంటుకుని వృద్ధుడు మృతి

మనోహరాబాద్: దీపావళి రోజు ఇంట్లో దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు లుంగీకి నిప్పంటుకుని వృద్ధుడు మృతి చెందిన విషాద ఘటన మనోహరాబాద్ మండలంలో చోటుచేసుకుంది.

మనోహరాబాద్ మండలం పార్కిబండ గ్రామానికి చెందిన మల్లేష్ (65) దీపావళి రోజు ఇంట్లోనే దీపాలు వెలిగించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆయన ధరించిన లుంగీకి నిప్పు అంటుకొని తీవ్ర గాయాలయ్యాయి.

కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆయన చనిపోయినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.

ఈ ఘటనతో పార్కిబండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబ సభ్యులను గ్రామస్తులు ఓదార్చారు. ఎసై సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RAJU,TOOPRAN

RAJU,TOOPRAN