Sangareddy: దిగ్వాల్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం!

Sangareddy: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామంలో ప్రతి శనివారం కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణంలో భాగంగా వేణుగోపాల్ గౌడ్ గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

SATYANARAYANA, ZHAHEERABAD
Published on: 15 Nov 2026 11:43 AM IST
Sangareddy
X

Sangareddy: దిగ్వాల్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం!

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి శనివారం కొనసాగుతోంది. అందులో భాగంగా గ్రామానికి చెందిన వేణుగోపాల్ గౌడ్ గృహంలో ఆంజనేయుడి చిత్రపటానికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా భక్తులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం, లలిత సహస్రనామాలు, గోవింద నామాలు ఆలపించారు. హాజరైన భక్తులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి,పురోహితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

SATYANARAYANA, ZHAHEERABAD

SATYANARAYANA, ZHAHEERABAD