Asifabad: షార్ట్ సర్క్యూట్‌తో టాటా ఏస్ దగ్ధం: తప్పిన పెను ప్రమాదం!

Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా 363వ జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్‌తో టాటా ఏస్ దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ఎనిమిది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 7 Nov 2026 2:38 PM IST
Asifabad
X

Asifabad: షార్ట్ సర్క్యూట్‌తో టాటా ఏస్ దగ్ధం: తప్పిన పెను ప్రమాదం!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని 363వ జాతీయ రహదారిపై వాహన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బూరుగుడా బీఎడ్ కళాశాల సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా టాటా ఏస్ ప్యాసింజర్ వాహనం పూర్తిగా దగ్ధమైంది.

TS 1 EB 6667 నంబర్ గల ఈ వాహనం గెడేకర్ రవీందర్‌కు చెందినది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. వాహనంలో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనాస్థలానికి చేరుకునేలోపే వాహనం పూర్తిగా కాలిపోయింది. చివరకు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే వాహనం పూర్తిగా దగ్ధం కావడంతో యజమానికి నష్టం వాటిల్లింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.