Chandrapur: తాడోబాలో సచిన్ టెండూల్కర్ సందడి.. భార్య అంజలితో కలిసి పులుల వీక్షణం!

Chandrapur: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యాన్ని సందర్శించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 29 Nov 2026 7:23 AM IST
Chandrapur
X

Chandrapur: తాడోబాలో సచిన్ టెండూల్కర్ సందడి.. భార్య అంజలితో కలిసి పులుల వీక్షణం!

Chandrapur: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన తాడోబా అభయారణ్యాన్ని సందర్శించారు. తన భార్య అంజలీతో పాటు స్నేహితులతో కలిసి పులుల వీక్షణ కోసం తాడోబాకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు అభయారణ్యంలో పర్యటిస్తూ వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

సచిన్ తాడోబాను సందర్శించడం ఇది తొమ్మిదోసారి అని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. చిమూర్ తాలూకాలోని కోర్జోన్ గేట్, కోలారా మార్గాల ద్వారా అభయారణ్యంలోకి ప్రవేశించి నవేగావ్ మోడ, పాండరపౌని ప్రాంతాల్లో టాప్‌ జీపులో సఫారీ చేయనున్నారు.

చిమూర్‌లోని వెదురు రిసార్ట్‌లో బస చేస్తున్న సచిన్.. తనకు ఇష్టమైన బాజిలీ, యువరాజ్ అనే పులుల సంచారాన్ని వీక్షించినట్లు సమాచారం. పులుల సహజ ఆవాసాల్లో వాటి కదలికలను ప్రత్యక్షంగా తిలకిస్తూ అటవీ అందాలను ఆస్వాదిస్తున్నారు.

సచిన్ పర్యటన విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునే అవకాశం ఉండటంతో అటవీశాఖ అధికారులు ఈ పర్యటన వివరాలను గోప్యంగా ఉంచారు. ఆయన పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.