Kagaznagar: కాగజ్‌నగర్‌లో ఆత్మహత్యాయత్నం తండ్రీకూతుళ్లకు తీవ్ర గాయాలు
Kagaznagar: కాగజ్‌నగర్ న్యూ కాలనీలో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం. తండ్రిని కాపాడబోయి కూతురుకూ తీవ్ర గాయాలు. ఇద్దరినీ మంచిర్యాల ఆసుపత్రికి తరలింపు.
Kagaznagar: కాగజ్‌నగర్‌లో ఆత్మహత్యాయత్నం తండ్రీకూతుళ్లకు తీవ్ర గాయాలు
కాగజ్‌నగర్: కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి నిప్పంటించుకున్న ఘటన కాగజ్‌నగర్ పట్టణంలోని న్యూ కాలనీలో కలకలం రేపింది.
ఈ ఘటనలో తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన కూతురుకు సైతం మంటలు అంటుకోవడంతో తండ్రీకూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.




