Wanaparthy: కొత్తకోట వద్ద లారీ క్యాబిన్ దగ్ధం: తప్పిన ప్రాణాపాయం!
Wanaparthy: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద 44వ జాతీయ రహదారిపై రన్నింగ్ లారీలో అగ్నిప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది.
Wanaparthy: కొత్తకోట వద్ద లారీ క్యాబిన్ దగ్ధం: తప్పిన ప్రాణాపాయం!
వనపర్తి జిల్లా, కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ శివారులో జాతీయ రహదారి-44పై రన్నింగ్‌లో ఉన్న లారీలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లారీలో మంటలు చెలరేగడంతో క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది.
లారీలో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై లారీని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
డ్రైవర్ సమయస్ఫూర్తి, అగ్నిమాపక సిబ్బంది తక్షణ స్పందనతో ప్రాణనష్టం జరగకుండా ప్రమాదం నివారించగలిగారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.




