Kalwakurthy: తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

Kalwakurthy: తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి. కల్వకుర్తి సమస్యలు, పట్టభద్రుల ఓటరు నమోదుపై సుదీర్ఘ చర్చ.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 10 Nov 2026 8:01 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని గోలి శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.వారితో పాటుమాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు ఉన్నారు.

కార్యక్రమంలో కల్వకుర్తి మండలం BRS పార్టీ అధ్యక్షులు సింగం విజయ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, కృష్ణ రెడ్డి, సుభాష్, బుచ్చిబాబు,బుజ్జి, శేఖర్, తోపాటు తదితరులు ఉన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY