Wanaparthy: పెబ్బేరులో విద్యుత్ వైర్లు తగిలి వరిగడ్డి లోడ్‌తో ఉన్న లారీలో మంటలు!

Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరులో విద్యుత్ వైర్లు తగిలి వరిగడ్డి లారీలో మంటలు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 28 Oct 2026 12:59 PM IST
Wanaparthy
X

Wanaparthy: పెబ్బేరులో విద్యుత్ వైర్లు తగిలి వరిగడ్డి లోడ్‌తో ఉన్న లారీలో మంటలు!

Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో వరిగడ్డి తరలిస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. గుర్రంగడ్డ నుంచి పెబ్బేరుకు వరిగడ్డిని తరలిస్తున్న వాహనం భగీరథ విగ్రహం వద్దకు చేరుకోగానే, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా గడ్డి విద్యుత్ వైర్లకు తాకడంతో మంటలు చెలరేగినట్లు తెలిసింది. మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనంలోని జాక్ను ఉపయోగించి గడ్డిని పైకి లేపి, మంటలు వ్యాపించకుండా గడ్డిని అక్కడక్కడా కింద పడవేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో ఎం.ఆర్.ఓ కార్యాలయ రోడ్డుపై కూడా రోడ్డుపై కూడా వరిగడ్డి పడిపోవడంతో స్థానిక కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి పట్టణంలోని రహదారులపై ఎత్తుగా వరిగడ్డి, ఇతర సామగ్రిని తరలించే వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ వైర్లు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU