Kalwakurthy: సిలిండర్ పేలుడు బాధితుడికి ఎమ్మెల్యే కసిరెడ్డి సాయం

Kalwakurthy: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రామగిరిలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటనలో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆదేశాలతో ఆర్థిక సాయం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 26 Sept 2026 9:02 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: సిలిండర్ పేలుడు బాధితుడికి ఎమ్మెల్యే కసిరెడ్డి సాయం

నాగర్ కర్నూలు జిల్లా: కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామ పరిధిలోని రామగిరిలో రెండు మూడు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మద్దిలేటి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సిలిండర్ పేలడంతో ఇంట్లో భారీగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో వంట సామగ్రితో పాటు నగదు, బంగారం, పప్పు, బియ్యం, దుస్తులు తదితర వస్తువులు కాలిపోయాయి.

ఈ ఘటనపై స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీపురం హరీష్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ గణేష్ కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వార్డు మెంబర్స్ మాజీ వార్డ్ మెంబర్స్ మరియు ప్రజలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY