Markapur: ఎనామిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. రూ.15 లక్షల నష్టం!

Markapur: మార్కాపురం పట్టణంలోని సాయి బాలాజీ థియేటర్ రోడ్డులో ఉన్న ఎనామిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 15 Nov 2026 7:33 AM IST
Markapur
X

Markapur: ఎనామిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. రూ.15 లక్షల నష్టం!

Markapur: మార్కాపురం పట్టణంలోని సాయి బాలాజీ థియేటర్ రోడ్డులో ఉన్న ఎనామిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలోని పలకల తయారీకి ఉపయోగించే రెండు యంత్రాలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. అయితే అగ్నిప్రమాదం ఎలా సంభవించింది? విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది.

ప్రమాదానికి గల అసలు కారణాలు, జరిగిన నష్టంపై పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM