Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో సిల్క్ బట్టల షాపులో అగ్నిప్రమాదం!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మెయిన్ బజార్‌లోని వెంకటలక్ష్మి సిల్క్ షాపులో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం. మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది, స్థానికులు.

Bheemalinga, Aluru
Published on: 1 Oct 2026 9:57 AM IST
Kurnool
X

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో సిల్క్ బట్టల షాపులో అగ్నిప్రమాదం!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని మెయిన్ బజార్‌లో వెంకటలక్ష్మి సిల్క్ బట్టల షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా షాపులో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్‌తో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఫైర్ సిబ్బందితో పాటు అక్కడ ఉన్న స్థానికులు కూడా వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది, స్థానికులు కలిసి మంటలను అదుపు చేస్తున్నరు ఈ ప్రమాదానికి ఆస్తి నష్టం వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru