Kajuluru: కోలంకలో భారీ అగ్నిప్రమాదం.. రైస్ మిల్లు, పీచు ఫ్యాక్టరీ దగ్ధం
Kajuluru: కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో భారీ అగ్నిప్రమాదం జరిగి రైస్ మిల్లు, పీచు ఫ్యాక్టరీ దగ్ధమయ్యాయి. సుమారు రూ.35 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
Kajuluru: కోలంకలో భారీ అగ్నిప్రమాదం.. రైస్ మిల్లు, పీచు ఫ్యాక్టరీ దగ్ధం
కాకినాడ జిల్లా: కాజులూరు మండలం కోలంకలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోలంక గ్రామానికి చెందిన స్థానిక మాజీ ఎంపీటీసి, మాజీ పీఏసిఎస్ చైర్మెన్ తొగరు చంద్రశేఖర్ బాబుకు చెందిన రైస్ మిల్లులో సంభవించిన అగ్ని మంటలు ప్రక్కనే ఉన్న ఆయన పీచు ఫ్యాక్టరీకి వ్యాపించి గోడౌన్లలో ఉన్న దాన్యం బస్తాలు, కొబ్బరి పీచు బ్లేల్లు దగ్ధమయ్యాయి.
ఈ సంఘటనకు సంబందించి స్థానికులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం సమయంలో రైసుమిల్లులో ఆకస్మాత్తుగా మంటలు సంభవించాయి. సిబ్బంది గమనించి యజమానికి సమాచారమందించగా అతను వచ్చేసరికే మంటలు సమీపంలో ఉన్న ఆయన పీచు ఫ్యాక్టరీకి వ్యాపించాయి. చంద్రశేఖర్బాబు అగ్నిమాపక కేంద్రాలకు సమాచారమందించారు.
కాకినాడ అగ్నిమాపక కేంద్రాల నుంచి ఫైర్ ఇంజన్లతో సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే రైసుమిల్లులో బియ్యం ఆడేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 500 బస్తాల ధాన్యం, పీచు ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ముడిసరుకు, తయ్యారు చేసి ఎగుమతికి సిద్ధంగా ఉంచిన పీచు సమాగ్రీ, 1300 పీచు బ్లేల్లు, ఎలివేటరు, మోటార్లు, గొడౌన్లు కాలిపోయాయి.
పైర్ అధికారి వి సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. షార్క్ సర్యూట్ కారణంగా మంటలు సంబవించి ఉంటాయని స్థానికులు బావిస్తున్నారు. రైసుమిల్లులో ధాన్యం బస్తాలు, పీచు ఫ్యాక్టరీలో ముడి సరుకు, యంత్ర సామాగ్రితోపాటు ఎగుమతికి సిద్ధంగా ఉంచిన పీచు బ్లేల్లుతో ఆస్తి నష్టం సుమారు రూ. 35 లక్షలు ఉంటుందని యజమాని చంద్రశేఖర్బాబు తెలిపారు.




