Pulivendula: పులివెందులలో అలజడికి కుట్ర బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు!

Pulivendula: పులివెందుల మున్సిపల్ పోలింగ్ వేళ భారీ కుట్ర జరుగుతోందని టీడీపి నేత బీటెక్ రవి సంచలన ఆరోపణలు. సొంత వాహనాలను దహనం చేసుకుని కూటమిపై నిందలేసే ఎత్తుగడ అని విమర్శ.

T. AMARNATH, PULIVENDULA
Published on: 1 Nov 2026 6:55 AM IST
Pulivendula
X

Pulivendula: పులివెందులలో అలజడికి కుట్ర బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు!

Pulivendula: మున్సిపల్ పోలింగ్ వేళ పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతకు, అలజడికి పక్కా వ్యూహం రచిస్తున్నారంటూ టీడీపీ నేత, నియోజవర్గ ఇన్చార్జి బీటెక్ రవి తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు.

​వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లక్ష్యంగా బీటెక్ రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము సృష్టించే అలజడిని ప్రభుత్వంపైకి నెట్టేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. తమ సొంత వాహనాలతో పాటు సాక్షి లైవ్ వ్యాన్లను వారే స్వయంగా దహనం చేసుకుని, ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వంపై మోపేలా దుష్ట పన్నాగానికి తెరలేపారని ఆయన ఆరోపించారు.

​స్థానిక ఆడిటోరియంలో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో తిష్టవేశారని, వారిని తరలించి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను కోరారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA