Shamirpet: గుడిసెలో చెలరేగిన మంటలు.. ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది!

Shamirpet: శామీర్పేట మండలం లాల్గాడి మలక్పేట్ గ్రామంలో గుడిసెకు అంటుకున్న మంటల్లో చిక్కుకున్న సత్యరాజును పోలీసులు, 108 సిబ్బంది సమయానికి స్పందించి కాపాడారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 12 Nov 2026 10:45 AM IST
Shamirpet
X

Shamirpet: గుడిసెలో చెలరేగిన మంటలు.. ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది!

Shamirpet: శామీర్పేట మండలం లాల్గాడి మలక్పేట్ ఊరికి చెందిన సత్యరాజు వయస్సు 50 సం. గుడిసెలో నిద్రిస్తుండగా ఉదయం 3.30 గంటల సమయంలొ ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి గుడిసె కాలిపోగా అటుగా వెళుతున్న పోలీసులు సమయానికి స్పందించి 108 అంబులెన్సుకు ఫోన్ చేసి సమాచారం అందించగా

శామీర్పేట్ అంబులెన్సు సిబ్బంది EMT యాదమ్మ మరియు పైలట్ బాలాజీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని డాక్టర్ శివ గారి సూచనల మేరకు ప్రథమ చికిత్స అందుస్తూ గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

సమయానికి చేరుకొని సత్యరాజు ప్రాణాలను కాపాడినందుకు పోలీసువారు ప్రశాంశించగా బాధితుడి కుటుంబ సభ్యులు EMT యాదమ్మకు మరియు పైలట్ బాలాజీకు కృతజ్ఞతలు తెలిపారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL