Hyderabad: కండక్టర్ ప్రవళికకు అండగా ఉంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్!

Hyderabad: ఖమ్మంలో ప్రయాణికురాలి దాడిలో గాయపడిన కండక్టర్ ప్రవళికను హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

RAHUL, MEERPET
Published on: 27 Oct 2026 10:47 PM IST
Hyderabad
X

Hyderabad: కండక్టర్ ప్రవళికకు అండగా ఉంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్!

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో ప్రయాణికురాలు నెట్టడంతో ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడిన కండక్టర్ ప్రవళికను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవళిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం ప్రాంతంలో ఆధార్‌ కార్డు లేకుండా బస్సు ఎక్కిన ప్రయాణికురాలిని టికెట్‌ డబ్బులు చెల్లించాలని కండక్టర్ ప్రవళిక కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రయాణికురాలు ఆమెను నెట్టడంతో బస్సు చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET