Nuthankal: నూతనకల్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు: మహిళకు తీవ్ర గాయాలు
Nuthankal: ఎల్లంపేట మున్సిపాలిటీ నూతనకల్‌లో గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో ఇంటి గోడలు కూలి, అద్దెకుంటున్న 24 ఏళ్ల అంజనికి తీవ్ర గాయాలయ్యాయి.
Nuthankal: నూతనకల్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు: మహిళకు తీవ్ర గాయాలు
ఎల్లంపేట: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్ వార్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు తీవ్ర కలకలం రేపింది. బండమీది సూర్యారావు ఇంట్లో అద్దెకు ఉంటున్న అంజని (24) ఇంట్లో గ్యాస్ లీకేజీ కారణంగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
ఈ పేలుడు ధాటికి ఇంటి గోడలు కూలిపోయి కిందపడటంతో పాటు ఇంట్లో ఉన్న అంజనికి మంటలు అంటుకుని తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల నివాసితులు భయభ్రాంతులకు గురయ్యారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన అంజనిని చికిత్స నిమిత్తం అందుబాటులో ఉన్న సీఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో నూతనకల్ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఇంటికి భారీగా నష్టం వాటిల్లగా, బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. గ్యాస్ సిలిండర్ల వినియోగంలో అప్రమత్తత ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.




