Hyderabad: చెస్‌లో చిన్నారుల ప్రతిభ.. ప్రపంచ రికార్డులే లక్ష్యం
Hyderabad: హైదరాబాద్ హైటెక్ సిటీలో ఐదుగురు చిన్నారుల చెస్ నైపుణ్య ప్రదర్శన; ప్రపంచ రికార్డులే లక్ష్యంగా సాగుతున్న చిన్నారులను అభినందించిన అజయ్ మిశ్రా, కుమారస్వామి.
Hyderabad: చెస్‌లో చిన్నారుల ప్రతిభ.. ప్రపంచ రికార్డులే లక్ష్యం
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐదుగురు చిన్నారులు తమ అద్భుత చెస్ ప్రతిభతో ఆకట్టుకున్నారు. 3 నుంచి 9 ఏళ్ల వయస్సు గల సయాన్ష్, ఇషిక, చైత్ర, మణి అస్రిత్, విహాన్ ప్రపంచ రికార్డుల లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్, డైమండ్ చెస్ అకాడమీ సంయుక్తంగా హైటెక్ సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులు తమ చెస్ నైపుణ్యాలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి చిన్నారులను అభినందించారు. చిన్న వయస్సులోనే వారి ప్రతిభ ప్రశంసనీయమని, తగిన ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని వారు పేర్కొన్నారు.




