Hyderabad: విద్యార్థుల సృజనాత్మకతకు సైన్స్ ఫెయిర్లు వేదికలు

Hyderabad: జూబ్లీహిల్స్ వెంకటగిరి జ్ఞానక్షేత్ర పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌కు ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

RAJESH,	WEST ZONE
Published on: 13 Nov 2026 3:58 PM IST
Hyderabad
X

Hyderabad: విద్యార్థుల సృజనాత్మకతకు సైన్స్ ఫెయిర్లు వేదికలు

హైదరాబాద్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో దోహదపడతాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంకటగిరి జ్ఞానక్షేత్ర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ ప్రాజెక్టులు, నమూనాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు.

విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా నూతన ఆలోచనలు, పరిశోధనలు, ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటు అంతర్ పాఠశాల పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE