Hyderabad: నవంబర్ 26, 27న హైదరాబాద్‌లో ‘రైడ్స్-2026’ సివిల్ ఇంజినీరింగ్ సదస్సు

Hyderabad: నవంబర్ 26, 27 తేదీల్లో గచ్చిబౌలి ESCIలో RIDES-2026 సివిల్ ఇంజినీరింగ్ సదస్సు, బిల్డ్-టెక్ ఎక్స్‌పో. వెయ్యి మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ నిపుణులు హాజరు.

RAJESH,	WEST ZONE
Published on: 5 Nov 2026 5:36 PM IST
Hyderabad
X

Hyderabad: నవంబర్ 26, 27న హైదరాబాద్‌లో ‘రైడ్స్-2026’ సివిల్ ఇంజినీరింగ్ సదస్సు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నవంబర్ 26, 27 తేదీల్లో RIDES-2026 సివిల్ ఇంజినీరింగ్ సదస్సు, బిల్డ్-టెక్ ఎక్స్‌పో నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ACCE(I) హైదరాబాద్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

సుస్థిర నిర్మాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విపత్తులను తట్టుకునే నిర్మాణాల రూపకల్పనపై ఈ సదస్సులో చర్చించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన వెయ్యి మందికి పైగా ఇంజినీరింగ్ నిపుణులు, ఆర్కిటెక్ట్‌లు, పరిశోధకులు పాల్గొననున్నారు.

ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తమ పరిశోధనలు, అనుభవాలను పంచుకోనున్నారు. సదస్సులో భాగంగా నిర్వహించే బిల్డ్-టెక్ ఎక్స్‌పోలో ఆధునిక నిర్మాణ సామగ్రి, యంత్రాలు, పర్యావరణహిత నిర్మాణ పరిష్కారాలను ప్రదర్శించనున్నారు. ఈ ఎక్స్‌పోను సాధారణ ప్రజలు కూడా సందర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE