Hyderabad: కొండాపూర్‌లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక 'యూపీజెడ్‌వై హౌస్'
Hyderabad: హైదరాబాద్ కొండాపూర్‌లో గిగ్ వర్కర్ల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన యూపీజెడ్‌వై హౌస్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సందర్శించారు.
Hyderabad: కొండాపూర్‌లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక 'యూపీజెడ్‌వై హౌస్'
హైదరాబాద్: హైదరాబాద్ కొండాపూర్‌లోని రాజరాజేశ్వరి నగర్‌లో గిగ్ వర్కర్ల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన యూపీజెడ్‌వై హౌస్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా డెలివరీ భాగస్వాములతో ఆత్మీయంగా ముచ్చటించి, వారితో కలిసి భోజనం చేశారు.
మొబైల్ ఛార్జింగ్, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, వినోద సదుపాయాలతో పాటు వారానికి కేవలం 99 రూపాయలకే అపరిమిత భోజనం అందించేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఇలాంటి కేంద్రాల ఏర్పాటు అభినందనీయమని మంత్రి, ఎమ్మెల్యే పేర్కొన్నారు.




