Hyderabad: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి జూతూరు కీర్తిరెడ్డి
Hyderabad: అంబర్‌పేటలో ప్రారంభమైన నషా ముక్త్ భారత్ మహా పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ నేత జూతూరు కీర్తిరెడ్డి; డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పిలుపు.
Hyderabad: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి జూతూరు కీర్తిరెడ్డి
హైదరాబాద్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్ మహా పాదయాత్ర అంబర్‌పేట మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా ప్రారంభమైంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, సినీ నటుడు విక్టరీ వెంకటేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూతూరు కీర్తిరెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ.. యువత దేశానికి బలమని, డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. డ్రగ్స్ రహిత సమాజం పోలీసులతోనో, రాజకీయ నాయకులతోనో మాత్రమే సాధ్యం కాదని, ప్రజలందరూ భాగస్వాములైనప్పుడే నషా ముక్త్ భారత్ సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు.
మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో డ్రగ్స్‌పై అవగాహన పెంపొందించాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు.




