Hyderabad: విజయ హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
Hyderabad: కాప్రాలోని విజయ హైస్కూల్‌లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయుల నృత్యాలు, మాదకద్రవ్యాల నిరోధక మరియు ఆత్మరక్షణ అవగాహన సదస్సులు నిర్వహించారు.
Hyderabad: విజయ హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కాప్రాలోని విజయ హైస్కూల్ పలు కార్యక్రమాలను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయుల నృత్య ప్రదర్శనలు,నాటికాభినయంతో తమ బాల్యాన్ని గుర్తుచేసుకుని చక్కని అభినయంతో విద్యార్థులను ఉర్రూతలూగించారు.పాఠశాల వాతావరణం విద్యార్థులతో ఆహ్లదభరితంగా మారింది.
అనంతరం మాదకద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సును మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిలర్ పి.గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఒక్కసారి అలవాటు పడితే జీవితాన్ని కోల్పోవలసి వస్తుందని,కొన్ని ఉదాహరణలతో సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్.సంతోష్ కుమార్ సముద్దుల్హా
బాలికల ఆత్మరక్షణ అవగాహన సదస్సు “మిషన్ సురక్ష సెల్ఫ్ డిఫెన్స్” ది షీల్డ్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు గౌరవ సంతోషకుమార్ ఆధ్వర్యంలో బాలికలకు స్వీయరక్షణను ఎలా పొందాలోకృత్యాల రూపంలో ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
కరస్పాండెంట్ కొప్పునూరి రాజేశ్వర్ మాట్లాడుతూ.. "భావితరానికి బాధ్యతాయుతంగా నైతిక విలువలతో మార్గదర్శకంగా ఉండాలని కోరారు. అనంతరం యాజమాన్యం విద్యార్థులందరికీ స్వీట్ ప్యాకెట్లను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొప్పునూరు వీణ,ప్రిన్సిపాల్ డి.వి.బాబు, ప్రధానోపాధ్యాయురాలు అద్దంకి పద్మావతి, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.




