Hyderabad: ఆర్‌ఆర్‌సీ దక్షిణ భారత అధ్యక్షునిగా చాముండేశ్వరి స్వామి

Hyderabad: రామాయణ రీసర్చ్ సెంటర్ దక్షిణ భారతదేశ అధ్యక్షునిగా కృష్ణ చాముండేశ్వరి స్వామి నియమితులయ్యారు. బేగంపేటలో నియామక పత్రం అందజేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 29 Nov 2026 4:52 PM IST
Hyderabad
X

Hyderabad: ఆర్‌ఆర్‌సీ దక్షిణ భారత అధ్యక్షునిగా చాముండేశ్వరి స్వామి

హైదరాబాద్: భరత భూమిని పాలించిన శ్రీరాముడి విశిష్టతలపై పనిచేస్తున్న రామాయణ రీసర్చ్ సెంటర్ దక్షిణ భారతదేశ అధ్యక్షునిగా కృష్ణ చాముండేశ్వరి స్వామి నియమితులయ్యారు. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న కౌన్సిల్ ప్రతినిధులు బేగంపేట హరిత ప్లాజా హోటల్లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయణ విశిష్టత పై లోతైన అధ్యయనం చేయడంతో పాటు ప్రతి హిందువుకు రామాయణాన్ని పరిచయం చేయడమే లక్ష్యం అని అన్నారు.

ప్రస్తుతం అయోధ్య రామ మందిరం పూర్తయినందున బీహార్లోని పురాతన సీతా అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించనున్నట్లు తెలిపారు. భాగ్యనగరంలో సైతంచాముండేశ్వరి స్వామి అమ్మవారి భవ్య మందిరాన్ని నిర్మించేందుకు పూర్తి చేసినట్లు త్వరలోనే భూమి పూజ చేస్తామని చెప్పారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE