Hyderabad: బసవతారకం ఆసుపత్రిలో క్యాన్సర్‌ను జయించిన చిన్నారులతో వేడుకలు

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ బసవతారకం ఆసుపత్రిలో క్యాన్సర్‌ను విజయవంతంగా జయించిన చిన్నారులతో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

RAJESH,	WEST ZONE
Published on: 14 Nov 2026 6:05 PM IST
Hyderabad
X

Hyderabad: బసవతారకం ఆసుపత్రిలో క్యాన్సర్‌ను జయించిన చిన్నారులతో వేడుకలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇమేజింగ్ ఎండ్‌పాయింట్స్ సంస్థకు చెందిన కేరింగ్ ఎండ్‌పాయింట్స్ ఆధ్వర్యంలో వరుసగా రెండో ఏడాది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కీమోథెరపీ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకుని క్యాన్సర్‌ను జయించిన చిన్నారులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. సంస్థ సీఈఓ డౌగ్ బర్కెట్ చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి, ఖచ్చితమైన వైద్య నిర్ధారణతో మెరుగైన చికిత్స అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE