Hyderabad: బాలాపూర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
Hyderabad: హైదరాబాద్ మీర్‌పేట్ పీఎస్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద టిప్పర్ డీకొట్టి స్కూటీపై వెళ్తున్న మహిళ మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
Hyderabad: బాలాపూర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
హైదరాబాద్: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చర్చికి వెళ్లి తిరిగి స్కూటీపై మల్లాపూర్ లోని ఇంటికి వెళ్తున్న భార్యాభర్తలను టిప్పర్ ఢీకొట్టింది.
చిట్టెమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్తకు గాయాలయ్యాయి. గాయపడిన భర్తను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.




