Hyderabad: ఉత్సాహంగా అస్మిత ఖేలో ఇండియా ట్రాక్ సైక్లింగ్ పోటీలు
Hyderabad: హైదరాబాద్‌లో నిర్వహించిన అస్మిత ఖేలో ఇండియా సౌత్ జోన్ మహిళా ట్రాక్ సైక్లింగ్ పోటీలకు 5 రాష్ట్రాల నుంచి 240 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు.
Hyderabad: ఉత్సాహంగా అస్మిత ఖేలో ఇండియా ట్రాక్ సైక్లింగ్ పోటీలు
హైదరాబాద్: మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించడంతో పాటు సైక్లింగ్ క్రీడ అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అస్మిత ఖేలో ఇండియా సౌత్ జోన్ ఉమెన్స్ ట్రాక్ సైక్లింగ్ జోనల్ లీగ్‌కు విశేష స్పందన లభించింది. దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల నుంచి సుమారు 240 మంది మహిళా క్రీడాకారిణులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించగా క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన అధ్యక్షుడు పి. మల్లారెడ్డి మాట్లాడుతూ.. మహిళా సైక్లింగ్‌కు ప్రాధాన్యత పెంచడంతో పాటు వివిధ రాష్ట్రాల క్రీడాకారిణులకు ప్రతిభ నిరూపించుకునే అవకాశం కల్పించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన బాలికలను గుర్తించి తగిన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని పేర్కొన్నారు.మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సైక్లిస్టులను తయారు చేయడంలో అస్మిత ఖేలో ఇండియా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జి. చంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి. విజయ్‌కాంత్ రావు, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అబ్జర్వర్ మాక్సివెల్ ట్రైవర్, సాట్స్ కోచ్‌లు భాస్కర్ రెడ్డి, పాండు జాదవ్, రైల్వే కోచ్ ధర్మతేజ, జిల్లా కార్యదర్శులు రమేష్, గోపాలం, పౌల్స్, నరేష్ తదితరులు హాజరయ్యారు.




