Parchur: ఉప్పుటూరులో అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే ఏలూరి ఆసరా
Parchur: బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాలతో టీడీపీ నేతలు పరామర్శించి అండగా నిలిచారు.
Parchur: ఉప్పుటూరులో అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే ఏలూరి ఆసరా
పర్చూరు: ఉప్పుటూరు గ్రామంలో గురువారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు కష్టకాలంలో ఆసరా లభించింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు తెదేపా మండల అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ షంషుద్దీన్, నేతలు హుస్సేన్, ఆంజనేయులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.




