Chintalapudi: చింతలపూడిలో యూసీజీ ప్రాజెక్ట్‌పై ఆందోళన వైఎస్‌ జగన్‌ను కలిసిన రైతులు!

Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రతిపాదిత అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు వైఎస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI
Published on: 23 Sept 2026 12:48 PM IST
Chintalapudi
X

Chintalapudi: చింతలపూడిలో యూసీజీ ప్రాజెక్ట్‌పై ఆందోళన వైఎస్‌ జగన్‌ను కలిసిన రైతులు!

Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి–రేచర్ల ప్రాంతంలో ప్రతిపాదిత అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (UCG) ప్రాజెక్ట్‌పై స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని చింతలపూడి మండల రైతులు కలిసి తమ అభ్యంతరాలను, ఇబ్బందులను వివరించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, తమ ప్రాంతంలో వేలాది కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, సాగునీరు, సారవంతమైన పంట భూములపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ వల్ల జరిగే నష్టంపై పూర్తి స్థాయిలో పర్యావరణ, శాస్త్రీయ అధ్యయనం చేయాలని వారు కోరారు.

రైతులు వివరించిన సమస్యలను శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు సానుకూలంగా విన్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వాస్తవాలు, ప్రాజెక్ట్ వివరాలు, రైతులపై పడే ప్రభావం తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి తనకు పూర్తి నివేదిక అందించాలని చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ శ్రీ కంభం విజయరాజు గారిని, దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ కొట్టారు అబ్బాయి చౌదరి గారిని ఆదేశించారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI