April 2026 Exams and Results: ఏపీ, తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి?

April 2026 Exams and Results: ఏప్రిల్ నెలలో రాబోయే పరీక్షలు, రిజల్ట్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు

KVD Varma
Updated on: 31 March 2026 3:27 PM IST
April 2026 Exams and Results: ఏప్రిల్ నెలలో రాబోయే పరీక్షలు, రిజల్ట్స్
X

April 2026 Exams and Results

April 2026 Exams and Results: ఏప్రిల్ నెల వచ్చేస్తోంది. ఇప్పటికే స్కూల్స్ లో కాలేజీల్లో పరీక్షలు చాలా వరకూ పూర్తి అయిపోయాయి. కొన్ని పరీక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఏప్రిల్ నెలలో ఎంట్రన్స్ పరీక్షల జోరు మొదలవుతుంది. అలాగే పరీక్షల ఫలితాలు వచ్చేస్తాయి. సెలవుల్లో ఎంజాయ్ చేసే అవకాశం లేకుండా పెద్ద క్లాసుల విద్యార్థులు ఒకవైపు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి.. మరోవైపు వచ్చే రిజల్ట్స్ కోసం ఎదురు చూడాలి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో రాబోయే పరీక్షల వివరాలు అలానే.. రాబోతున్న పరీక్షల రిజల్ట్స్ కు సంబంధించిన తేదీలు తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్.. రిజల్ట్స్

ఇంటర్మీడియట్..

ఏపీ తెలంగాణల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో ముగిశాయి. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల రిజల్ట్స్ ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటర్ పేపర్స్ మూల్యాంకనం పూర్తి అయినట్టు తెలుస్తోంది. రెండు మూడురోజుల్లోనే ఈ రిజల్ట్స్ పై అప్ డేట్ రావచ్చు.

ఇక తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా మార్చి నెలలోనే పూర్తయ్యాయి. రిజల్ట్స్ ఏప్రిల్ 6-10 తేదీల మధ్యలో వచ్చే అవకాశం ఉంది. అయితే, ఏప్రిల్ 12 విడుదల కావచ్చని కొన్ని మీడియా సంస్థలు సూచించాయి. అధికారికంగా తేదీ ఏప్రిల్ మొదటి వారంలో రావచ్చు.

పదోతరగతి..

ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 30వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షల రిజల్ట్స్ సాధారణంగా పరీక్షలు ముగిసిన మూడు నాలుగు వారాల్లో వస్తాయి. ఆ లెక్కన చూసుకుంటే రిజల్ట్స్ ఏప్రిల్ మూడు లేదా నాలుగో వారంలో వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణాలో పదోతరగతి పరీక్షలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. మార్చి 14న ప్రారంభమైన పరీక్షలు సెలవుల కారణంగా దాదాపుగా నెల రోజుల పాటు కొనసాగుతున్నాయి. మార్చి 31నాటికి నాలుగు పరీక్షలు పూర్తయ్యాయి. మిగిలిన పరీక్షలు ఏప్రిల్ లో జరుగుతాయి. ఆ టైమ్ టేబుల్ ఇలా ఉంది.

  • March 14: ఫస్ట్ లాంగ్వేజ్ (Group A/Composite)
  • March 18: సెకండ్ లాంగ్వేజ్
  • March 23: థర్డ్ లాంగ్వేజ్ (English)
  • March 28: ,మేథమేటిక్స్
  • April 2: సైన్స్ Part-I (Physical Science)
  • April 7: సైన్స్ Part-II (Biological Science)
  • April 13: సోషల్ స్టడీస్
  • April 15: OSSC Main Language Paper-I / Vocational Course
  • April 16: OSSC Main Language Paper-II

ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే మే మొదటి లేదా రెండో వారంలో వచ్చే అవకాశం ఉంది.

ఏప్రిల్ నెలలో జాతీయస్థాయి పరీక్షలు ఇవే..

ఏప్రిల్ నెలలో జాతీయ స్థాయిలో JEE Main 2026 Session 2 పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకు ఉంటాయి. B.E./B.Tech(పేపర్ 1) B.Planning (పేపర్ 2A/2B). ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించి ఎడ్మిట్ కార్డులు విడుదల చేశారు.

ఎడ్మిట్ కార్డులను ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story