AP SSC 10th Result Date 2026: ఏపీ టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ విడుదల.. రిజల్ట్స్ ఎప్పుడంటే?

AP SSC 10th Result Date 2026: ఏపీ టెన్త్ క్లాస్ జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఫలితాల విడుదల ఎప్పుడు? కొత్త నిబంధనలు ఏంటి? పూర్తి వివరాలు ఇవే!

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 March 2026 11:29 PM IST
AP 10th Result Date 2026: Andhra Pradesh SSC Evaluation Starts from April 4
X

AP SSC 10th Result Date 2026: ఏపీ టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ విడుదల.. రిజల్ట్స్ ఎప్పుడంటే?

AP SSC 10th Result Date 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పరీక్షతో ఈ ఎగ్జామ్స్ పూర్తి కానుండగా, వెంటనే జవాబు పత్రాల మూల్యాంకనానికి పాఠశాల విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 6.40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ ప్రక్రియపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏప్రిల్ 4 నుంచి మూల్యాంకనం:

రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 4 నుంచి 13 వరకు మొత్తం 10 రోజుల పాటు మూల్యాంకన ప్రక్రియ నిర్వహించనున్నారు.

నిబంధనలు: ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు 40 పేపర్లను (ఉదయం 20, మధ్యాహ్నం 20) మాత్రమే మూల్యాంకనం చేయాలి.

ట్యాబ్‌ల వినియోగం: మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఈ ఏడాది ప్రత్యేకంగా ట్యాబ్‌లను ప్రవేశపెట్టారు. మార్కులను మాన్యువల్‌గా నమోదు చేయడంతో పాటు, వెంటనే ట్యాబ్‌లలో కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఫలితాలు ఎప్పుడంటే?

గతేడాది ఏప్రిల్ 23న ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే వేగంతో పనులు పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఏప్రిల్ 14 నుంచి మార్కుల నమోదు ప్రక్రియను ప్రారంభించి, ఏప్రిల్ మూడో వారం నాటికి (సుమారు ఏప్రిల్ 23 లోపు) ఫలితాలను వెల్లడించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

కట్టుదిట్టమైన నిబంధనలు:

మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై ప్రభుత్వం కఠినంగా ఉండనుంది. మార్కుల లెక్కింపులో తప్పులు దొర్లితే భారీ జరిమానాలు విధిస్తామని డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. ఖచ్చితత్వం పాటించేందుకే ఈసారి టెక్నాలజీని పెద్దపీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది విద్యార్థులు (3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు) 3,415 కేంద్రాల్లో పరీక్షలకు హాజరయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story