Bengal tiger Kiran death: బెంగాల్‌ టైగర్‌ కిరణ్‌ మృతి.. తండ్రి, తాత సైతం అదే వ్యాధితో..

Bengal tiger Kiran death:హైదరాబాద్ లోని బహదూర్‌పురా నెహ్రూ జూలాజికల్‌ పార్కులో రాయల్‌ బెంగాల్‌ వైట్‌ టైగర్‌ (కిరణ్‌– 8) మృతి చెందింది.

Samba Siva Rao
Updated on: 26 Jun 2020 8:55 AM IST
Bengal tiger Kiran death: బెంగాల్‌ టైగర్‌ కిరణ్‌ మృతి.. తండ్రి, తాత సైతం అదే వ్యాధితో..
X
Representational image

హైదరాబాద్ లోని బహదూర్‌పురా నెహ్రూ జూలాజికల్‌ పార్కులో రాయల్‌ బెంగాల్‌ వైట్‌ టైగర్‌ (కిరణ్‌– 8) మృతి చెందింది. బెంగాల్‌ టైగర్‌ (కిరణ్‌– 8) కుడివైపు దవడ భాగంలో ఏర్పడిన న్యూయో ప్లాస్టిక్‌ కణితితో బాధపడుతూ మరణించిందని అధికారులు వెల్లడించారు.

నెహ్రూ జూలాజికల్‌ పార్కు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. జూపార్కు లో పుట్టి పెరిగిన కిరణ్‌ గతకొంతకాలంగా న్యూయో ప్లాస్టిక్‌ ట్యూమర్‌తో బాధపడుతోంది. కొన్నిరోజులుగా ల్యాంకోన్స్‌ శాస్త్రవేత్తలు, వైద్యులు, జూపార్కు వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. గత నెల 29న టైగర్‌కు డాక్టర్‌ నవీన్, వీబీఆర్‌ఐ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

మృతి చెందిన కిరణ్ (టైగర్‌)కు వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. కిరణ్‌ తండ్రి బద్రి కూడా ట్యూమర్ తో బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిరణ్‌ (టైగర్‌) తాత రుద్ర పన్నెండేళ్ల వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది. బద్రి, రుద్ర, కిరణ్ ఒకే రకమైన వ్యాధితో మృతి చెందడంతో వైద్యులు శాంపిళ్లు సేకరించారు. జూపార్కుకే వన్నె తెచ్చే రాయల్‌ బెంగాల్‌ టైగర్లు ట్యూమర్‌ వ్యాధితో మరణించడంతో ఆందోళనకు గురి చేస్తోంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story