50 టైగర్ రిజర్వ్ ఫారెస్టులాలో హై అలర్ట్.. న్యూయార్క్ లో మొదటి సంక్రమణ కేసు

50 టైగర్ రిజర్వ్ ఫారెస్టులాలో హై అలర్ట్.. న్యూయార్క్ లో మొదటి సంక్రమణ కేసు
x
Highlights

మానవుల తరువాత, కరోనావైరస్ యొక్క ముప్పు ఇప్పుడు పులులపై ఉందా? మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వులో కొద్ది రోజుల క్రితం ఒక పులి చనిపోయింది.

మానవుల తరువాత, కరోనావైరస్ యొక్క ముప్పు ఇప్పుడు పులులపై ఉందా? మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెంచ్ టైగర్ రిజర్వులో కొద్ది రోజుల క్రితం ఒక పులి చనిపోయింది.అయితే అది శ్వాసకోశ వ్యాధితో జరిగిందని.. దీనికి కారణం కరోనా వైరస్ అని మొదట విశ్వసించారు. అయితే, దానికి పేగు దగ్గర పెద్ద హెయిర్‌బాల్ కారణంగా దానికి మరణం సంభవించిందని తరువాత తెలిసింది.

అయితే ఎందుకైనా మంచిదని.. భారతదేశంలోని 50 టైగర్ రిజర్వు ఫారెస్టులలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. దేశంలో మొత్తం పులుల సంఖ్య 2967 ఉంది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వీటిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

వాస్తవానికి, న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూలో 4 ఏళ్ల వయసు ఉన్న పులికి కరోనావైరస్ సోకింది. అప్పటి నుండి, ప్రపంచంలోని ఇతర దేశాలలో పులుల గురించి ఆందోళనలు క్రమంగా పెరిగాయి. పులులకు టైబర్స్ రాబిస్, ఆంత్రాక్స్, కనైన్ డింపర్స్ వ్యాధులు వచ్చిన చరిత్ర ఉంది. కాగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి చెందిన డాక్టర్ అనూప్ కుమార్ నాయక్ చెప్పిన దాని ప్రకారం, కరోనావైరస్ చాలా ప్రమాదకరమైనదని. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియదు, కాని తాము పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. వాటి గురించి ఆందోళన చెందుతున్నాము అని తెలిపారు.

ఇదిలావుంటే కరోనావైరస్ పులులను ఎలా ప్రభావితం చేస్తుందో శాస్త్రవేత్తలు ఇంకా కనుగొనలేకపోయారు. న్యూయార్క్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ హెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్ వోల్జర్ అంచనా ప్రకారం, బ్రోంక్స్ 'జూ' లోని పులికి బోనులను శుభ్రపరిచే సమయంలో వైరస్ చేరి ఉండవచ్చు. ప్రెషర్ వాషింగ్ వల్ల వైరస్ ఆవిరైపోతుంది అని అన్నారు.

మరోవైపు చైనాలోని హార్బిన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు ఈ వైరస్ పెంపుడు పిల్లుల లోకి వచ్చి ఇతర జంతువులను బిందువుల ద్వారా చేరుకోవచ్చని నివేదించారు. వారి ఫలితాలు గత నెలలో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories